Share News

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:36 PM

రక్త దానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

- అలంపూరు ఎమ్మెల్యే విజయుడు

అలంపూరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రక్త దానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూరులోని వివే కానంద యూత్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానం ద 162వ జయంతి, యువజన దినోత్సవం వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వి జయుడు హాజయ్యారు. ముందుగా స్వామి వివేకానందకు పూలమాలల వేసి నివాళులర్పిం చారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చారు. 80మందికి పైగా రక్తదానం చేశారు. వారికి ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - Jan 12 , 2025 | 11:36 PM