ఢిల్లీ విజయంపై బీజేపీ సంబురాలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:27 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయంపై ఆ పార్టీ నాయకులు శనివారం పేట జిల్లా కేంద్రంలో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు.

నారాయణపేటటౌన్/నర్వ/కోస్గి రూరల్/ కొత్తపల్లి/మక్తల్ రూరల్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయంపై ఆ పార్టీ నాయకులు శనివారం పేట జిల్లా కేంద్రంలో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని అన్నారు. పట్టణ అధ్యక్షుడు పోషల్ వి ోద్ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేష్‌వర్మకు, ఈ విజయానికి కారుకులైన ఢిల్లీ ఓటర్లకు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్, ఉపాధ్యక్షులు సత్యయాదవ్, తిరుపతిరెడ్డి, వెంకటయ్య, కృష్ణ, నందు నామాజీ, టౌన్ బిల్డర్ వెంకట్రా ములు తదితరులున్నారు.
అదేవిధంగా నర్వలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు అజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. నాయకులు నరేందర్‌రెడ్డి, మిలీ్ట్ర హన్మంతు, కుర్వ సత్యం, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
కోస్గిలోని శివాజీ చౌరస్తాలో కోస్గి ఉమ్మడి మండల బీజేపీ నాయకులు సంబురాలు జరుపు కున్నారు. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పాలెం ప్రశాంత్‌కుమార్, శ్రీకాంత్, సీబీ.వెంకటేష్ తదితరులున్నారు.
కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టారు. పార్టీ మండల అధ్య క్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, కే.నారాయణరెడ్డి, రవీందర్‌సింగ్, కుమ్మరి వెంకట్, కమ్మరి శివకుమార్, నవకాంత్‌రెడ్డి, మంగలి నాగరాజు తదితరులు ఉన్నారు.
మక్తల్ పట్టణంలో శనివారం బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య మాట్లాడుతూ 25 ఏళ్ల తరువాత తిరిగి దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి రావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్నేస్వామి, బాల్‌చేడ్ మల్లికార్జున్, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, బలరాంరెడ్డి, కల్లూరి నాగప్ప, లింగం, రాంమాధవ్ తదితరులున్నారు.