Share News

వైభవంగా భూలక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణం

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:30 PM

చారిత్రక కోటలో వెలసిన గద్వాల సంస్థానాధీశు ల కులదైవం భూలక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యా ణోత్సవాన్ని సోమవారం రాత్రి అంగరంగ వైభ వంగా నిర్వహించారు.

వైభవంగా భూలక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణం
భూలక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మయూర వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): చారిత్రక కోటలో వెలసిన గద్వాల సంస్థానాధీశు ల కులదైవం భూలక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యా ణోత్సవాన్ని సోమవారం రాత్రి అంగరంగ వైభ వంగా నిర్వహించారు. ఏడురోజుల పాటు నిర్వ హించనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ఉదయం విశేష ఫల పంచామృత అభి షేకం, పుష్పాలంకరణ, నిత్యపూజలు నిర్వహిం చారు. నిర్ణయించిన ముహూర్తం మేరకు రాత్రి భూలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి వారి కల్యా ణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణోత్సవం అనం తరం రాత్రి శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ మాడవీధిలో మయూర వాహనంపై ఊరేగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ విచారణకర్త ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారుడు సామవేదం వేణు గోపాలచారి ఆధ్వర్యంలో కీర్తనలు ఆలపించారు. మంగళవారం రాత్రి తెప్పోత్సవానికి మునిసిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Feb 10 , 2025 | 11:30 PM