Share News

రమణీయం.. రథోత్సవం

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:52 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని సింగోటం గ్రామంలో లక్ష్మీ నృసిం హస్వామి రథోత్సవం రమణీ యంగా సాగింది.

 రమణీయం.. రథోత్సవం
సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

- కనుల పండువగా సింగోటం లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

-వేలాదిగా తరలివచ్చిన భక్త జనసందోహం

- రథోత్సవం ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్‌ సంతోష్‌

-రథోత్సవంలో పాల్గొన్న కొల్లాపూర్‌ సంస్థానాధీశుడు సురభి ఆదిత్య లక్ష్మారావు, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ

కొల్లాపూర్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని సింగోటం గ్రామంలో లక్ష్మీ నృసిం హస్వామి రథోత్సవం రమణీ యంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవం గా సాగింది. ఆలయ ప్రధాన అ ర్చకుడు సంపత్‌ శర్మ స్వామివారి కి పూజలు నిర్వహించారు. రథో త్సవాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌ జి ల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, కొ ల్లాపూర్‌ సంస్థానాధీశుడు సురభి ఆదిత్య లక్ష్మారావు, జిల్లా ఎస్పీ రఘునాథ్‌ వైభవ్‌ గైక్వాడ్‌లు ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా జాతర ప్రాంగణం భక్త జనసందోహంతో కిక్కిరిసిపో యింది. తేరును లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం మంత్రి జూపల్లి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పూజలు చేసి రథాన్ని లాగారు. వేలాది భక్త జనసందోహం మధ్య రథచక్రాలు కది లాయి. లక్ష్మీ దేవమ్మ గుట్ట వద్ద ఉన్న శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి న తరువాత రథాన్ని తిరిగి యథాస్థానం వరకు లాగారు. వివిధ ప్రాం తాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో జాతర ప్రాంగణం కిక్కి రిసింది. భక్తులతో తినుబండారాలు, గాజులు, చెరుకు గడల దుకా ణాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మా ట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతాంగం సంతోషంగా, లాభ సాటిగా సాగు చేయాలని ఆ కాంక్షించారు. తెలంగాణ రా ష్ట్రం ప్రపంచ స్థాయిలోనే ప్ర త్యేక గుర్తింపు ఉండాలని స్వా మి వారి కృప కటాక్షం రాష్ట్రం పై చూపాలని, ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరగాలని స్వామి వారిని కోరకుంటున్న ట్లు మంత్రి చెప్పారు. నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ మాట్లాడు తూ... జిల్లాలోని ప్రజలు సం తోషాలతో జీవించాలని, జిల్లా లోని ప్రజలందరూ సోదర భావంతో ఉం డాలని, జిల్లా యం త్రాంగానికి ప్రజలకు మంచి చేకూరాలని సింగోటం లక్ష్మీ నరసిం హ స్వామి వారిని కో రుకుంటున్నట్లు కలెక్ట ర్‌ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ, కొల్లాపూర్‌ సంస్థాన రాజ వంశీకులు, ఆలయ ధర్మకర్త బాలాధిత్య లక్ష్మణరావు, లక్ష్మి నరసింహ స్వామి రథోత్సవ వివిధ శాఖల జిల్లా అధికా రులు, ప్రజాప్రతినిధులు, భక్తు లు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:52 PM