వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2025-05-28T23:11:10+05:30 IST
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ వైద్య సి బ్బందికి తెలిపారు.
వీపనగండ్ల, మే 28, (ఆంధ్రజ్యోతి) : సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ వైద్య సి బ్బందికి తెలిపారు. బుధ వారం మండల పరిధిలోని కల్వరాల, వీపనగండ్లలో వ్యాధి నిరోధక టీకాల కేం ద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసవాలు, గర్భిణుల రిజిస్ర్టేషన్ మెరుగు పర చాలని తెలిపారు. ఫ్రైడేను డ్రైడేగా తప్పనిసరి గా పాటించాలన్నారు. పరిశుభ్రత పాటించి కీ టక జనిత వ్యాధులను అరికట్టవచ్చవని సూ చించారు. అపరిశుభ్రతతో దోమలు వ్యాప్తి చెం దుతాయని, వాటి ద్వారా డెంగీ, మలేరియా, చి కెన్ గున్యా, పైలేరియా మెదడువాపు వంటి వ్యా ధులు వస్తాయన్నారు. ప్రజలకు అవగాహన క ల్పించాలని తెలిపారు.