Share News

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:33 PM

సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసా లు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని శాంతినగర్‌ ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు.

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

శాంతినగర్‌ ఎస్‌ఐ సంతోష్‌

వడ్డేపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసా లు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని శాంతినగర్‌ ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి వడ్డేపల్లి మండలం రామా పురం గ్రామంలో షీటీమ్‌, పోలీస్‌ కళాబృందం, భరోసా టీం సభ్యులతో కలిసి ఎస్‌ఐ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ డయల్‌ 100, రోడ్‌ సేఫ్టీ, సైబర్‌ క్రైమ్‌, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఫోక్సో కేసుల పర్యావస నాలు, సీసీ కెమెరాల ఉపయోగాలపై ప్రజలకు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా డయల్‌ 100ను ఉపయోగించుకో వాలని సూ చించారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మైనర్‌ బాలికలను లైంగికంగా, మానసికంగా వేధించిన వారిపై ఫోక్సో కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. సైబర్‌ నేరగాళ్లు పంపించే మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో కళాబృంబం సభ్యులు రాధమ్మ, కృష్ణ, శాంతి నగర్‌ పోలీసులు ఉన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:33 PM