పిల్లలకు మార్గదర్శకంగా నిలవాలి
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:32 PM
విద్యార్థు లు చక్కగా చదివి విద్యపరంగా అభివృద్ధి సా ధించాలంటే అందుకు తల్లిదండ్రుల బాధ్యత, ప్రోత్సాహం పూర్తిస్థాయిలో ఉండాలని అలంపూ ర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప అన్నారు.

- అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప
అయిజ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థు లు చక్కగా చదివి విద్యపరంగా అభివృద్ధి సా ధించాలంటే అందుకు తల్లిదండ్రుల బాధ్యత, ప్రోత్సాహం పూర్తిస్థాయిలో ఉండాలని అలంపూ ర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప అన్నారు. తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ కమిటి సహకారంతో ప్రతి సంవత్సరం ఉండెకారి సురేష్ మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది గీతిక, తేజస్వి 10జీపీఏ సాధించారు. ఈ మేర కు బుధవారం రాత్రి 10గంటల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసి స న్మానించిన అనంతరం మాట్లాడారు. వారి పెం పకం సైతం గర్వించే విధంగా ఉండాలని తెలిపారు. పిల్లలు ఉన్నతంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు మార్గదర్శకులుగా నిలవాలని తెలియచేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డి, మా జీ మునిసిపల్ చైర్మన్ దేవన్న, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలిఆచారి, ఆలయ కమి టీ సభ్యులు విష్ణు పాల్గొన్నారు.