బైలెల్లిన ఆదిపరాశక్తి
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:01 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, ఆదిపరాశక్తి ఈదమ్మ తల్లిని గురువారం డప్పుల దరువులతో పురవీధుల్లో ఊరేగించారు.

- డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపు
కొల్లాపూర్, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, ఆదిపరాశక్తి ఈదమ్మ తల్లిని గురువారం డప్పుల దరువులతో పురవీధుల్లో ఊరేగించారు. కొల్లాపూర్ పట్టణ శివారులో ఈదమ్మ ఆలయ పునఃప్రతిష్ఠోత్సవా లు మూడు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతు న్నాయి. గురువారం కొల్లాపూర్ పట్టణంలోని మాధవ స్వామి దేవాలయం నుంచిఈదమ్మ దేవత బైలెల్లింది. డప్పు దరువులు, పోతురాజుల నృత్యాల నడుమ భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఈదమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నది. ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావులతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్య కర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆల య శుద్ధి, యంత్ర ప్రతిష్ఠ, దేవతామూర్తుల ప్రతిష్ఠ కార్యక్రమాలను పురోహితులు ఘనంగా నిర్వహించా రు. నేడు ఉదయం 9:53 గంటలకు ఈదమ్మ తల్లి దేవాలయంలో విగ్రహపునఃప్రతిష్ఠ ఘనంగా నిర్వహిం చనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజర వుతారని ఈదమ్మ తల్లి దేవాయం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.