అంజన్న సన్నిధిలో ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర అదనపు డైరెక్టర్
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:29 PM
మండలంలోని పెద్దచింతరేవుల గ్రామం లోని ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శుక్ర వారం ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ డాక్టర్ లింగరాజు దంపతులు ద ర్శించుకున్నారు.

ధరూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దచింతరేవుల గ్రామం లోని ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శుక్ర వారం ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ డాక్టర్ లింగరాజు దంపతులు ద ర్శించుకున్నారు. అంతకుముందు వ్యవ స్థాపక వంశీయులు, ఆలయ ధర్మకర్త గిరి రావు, అర్చకులు మద్వాచారి, కిష్టాచారి వా రికి సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర అద నపు డైరెక్టర్ దంపతులు ఆంజనేయస్వామి మంగళహారతి ఇచ్చి ప్రత్యేకపూజలు నిర్వ హించారు. పూజల అనంతరం వారికి అర్చ కుడు ఆయనను శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందించి ఆలయ విశిష్టత ను గురించి వివరించారు.