Share News

క్రీడా విజేతలకు ట్రోఫీ, నగదు అందజేత

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:23 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని గుడిగండ్ల గ్రామంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెం ట్‌లో శుక్రవారం విజేతలకు దాత తిమ్మారెడ్డి బహుమతులు ప్రదా నం చేశారు.

క్రీడా విజేతలకు ట్రోఫీ, నగదు అందజేత
ఉడ్మల్‌గిద్దలో క్రీడాకారులకు నగదు బహుమతి అందిస్తున్న పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ

మక్తల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని గుడిగండ్ల గ్రామంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో శుక్రవారం విజేతలకు దాత తిమ్మారెడ్డి బహుమతులు ప్రదా నం చేశారు. మొదటి విజేత జట్టుకు రూ. ఏడు వేల నగదు ట్రోఫీ, రెండవ విజేతకు రూ.ఐదు వేల నగదు, ట్రోఫీ అందించారు.

ఉడ్మల్‌గిద్దలో...

దామరగిద్ద : మండలంలోని ఉడ్మల్‌గిద్దలో ఆరు రోజులుగా యువజన సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన క్రికెట్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. గెలుపొందిన ఎం.అంజి జట్టుకు ప్రథమ బహుమతి రూ.ఐదు వేలు, ద్వితీయ బహుమతి మల్కప్ప జట్టుకు రూ.మూడు వేల నగదును పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అందించారు.

Updated Date - Jan 17 , 2025 | 11:23 PM