21న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాక
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:29 PM
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసిం హ ఈనెల 21న మక్తల్ పట్టణానికి రానున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మక్తల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసిం హ ఈనెల 21న మక్తల్ పట్టణానికి రానున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాయచూరు రోడ్‌లో నూతనంగా నిర్మించే 150 పడకల ఆసుపత్రి భ వన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నా రు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ కటికె కతల్‌సాబ్‌కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.44,000 చెక్కు ను లబ్ధిదారునికి ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, పుర క మిషనర్ భోగేశ్వర్లు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.