21న సీఎం రేవంత్‌రెడ్డి రాక
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:36 PM
ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లాకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం హెలిప్యాడ్ కోసం స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి ఆమె పరిశీలించారు.

నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లాకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం హెలిప్యాడ్ కోసం స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఫొటోఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారన్నారు. వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్‘, వంద పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలం, ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, ఆర్డీవో రాంచందర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాంకిషన్, శివశంకర్, రాంలాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.