Share News

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 20 , 2025 | 11:24 PM

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు.

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
గణతంత్ర ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

కలెక్టర్‌

నారాయణపేట టౌన్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. అవార్డుల ప్రదానోత్సవం కోసం పేర్లను ఈనెల 22 వరకు పంపించాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీసు గౌరవ వందనం కోసం తగిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ బెన్‌షాలం తదితరులు పాల్గొన్నారు.

గ్రామసభల్లోనూ దరఖాస్తుల స్వీకరణ

ఈనెల 24 వరకు జరగబోయే గ్రామ సభ ల్లోనూ సంక్షేమ పథకాలకు సంబంధించిన దర ఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇప్ప టికే ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామన్నారు. రైతు భరోసాకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. భూమిలేని రైతులకు సైతం రూ.12వేలు అందించనున్నట్లు తెలిపారు.

కలెక్టరేట్‌ ప్రజావాణికి 25 ఫిర్యాదులు

కలెక్టరేట్‌ ప్రజావాణికి సోమవారం 25 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుంచి సంక్షేమ పథ కాల అమలు తదితర అంశాలపై బిజీబిజీగా ఉన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మధ్యాహ్నం తర్వాత ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రిజర్వేషన్‌ కల్పించాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని దివ్యాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేష్‌గౌడ్‌ కోరారు. సోమవారం ప్రజా వాణి సందర్భంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు.

Updated Date - Jan 20 , 2025 | 11:24 PM