Share News

డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:36 PM

జిల్లాలో 2008 సంవత్సరంలో డీఎస్సీ రాసిన అభ్యర్థులకు కోర్టు ఆదేశం మేరకు 50మందికి టీచర్లుగా ని యమించేందుకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు
అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

- జిల్లాలో కౌన్సెలింగ్‌కు హాజరైన 45 మంది

గద్వాల, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి) జిల్లాలో 2008 సంవత్సరంలో డీఎస్సీ రాసిన అభ్యర్థులకు కోర్టు ఆదేశం మేరకు 50మందికి టీచర్లుగా ని యమించేందుకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో 45మంది కౌన్సెలింగ్‌కు హాజరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. హాజరైన వారికి అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, డీఈవో అబ్దుల్‌ ఘని నియామక పత్రాలు అందజేశారు. 2008లో డీఎస్సీ పరీక్షలో టీచర్‌ పోస్టుల కు అర్హులైన వారు ఉద్యోగ నియామకాలలో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లారు. సుదీర్ఘకాలం పాటు కోర్టులో పోరాటం చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ మేరకు కాంటాక్టు బేసిస్‌పై 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఎస్‌జీటీ ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు పేర్కొనడం తో, జిల్లాలో అర్హత సాధించిన వారు 50మంది ఉన్నారు. కాగా 45మందికి నియామక పత్రాలు అందించారు. సోమవారం వారు విధుల్లో చేరాల ని ఆదేశించారు.

Updated Date - Feb 15 , 2025 | 11:36 PM