Share News

వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:40 PM

వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) టవర్‌ జిల్లాకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

- ఐటీ టవర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

- రూ.22 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ

వనపర్తి అర్బన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) టవర్‌ జిల్లాకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వనపర్తి మండల పరిధిలోని నాగవరం స మీపంలో సర్వే నెంబరు 167లోని 2ఎకరాల భూమిలో మాజీ మంత్రి కేటీఆర్‌తో ఐటీ టవర్‌ నిర్మాణానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డితో పాటు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు దృష్టికి తీసుకువెళ్లి తాజాగా ఐటీ టవర్‌ నిర్మాణానికి అనుమతులతో పాటు రూ.22 కోట్లు మంజూ రు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి పట్టణ సమీపంలో 2 ఎకరాలలో ఐటీ టవర్‌ నిర్మాణాన్ని 25వేల చదరపు అడుగులలో ఏకకాలంలో 250 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ పని చేసుకునే విధంగా సౌకర్యంగా ఏర్పాటు చే యనున్నారు. ఈ ఐటీ టవర్‌ నిర్మాణంతో గ్రామీణ ప్రాంతంలో ఐటీ హబ్‌ల ను అభివృద్ధి చేయడంతో పాటు, సామాజిక ఆర్ధిక అభివృద్ధితో పాటు యువ తకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఈ ఐటీ టవర్‌ నిర్మాణంతో ఉన్నత చదువులు అభ్యసించిన విద్యార్థులకు స్థానికంగానే ఉపాధి కల్పన దొరుకు తుంది. ఐటీ టవర్‌ నిర్మాణం కానుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ వల్లే

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తిలో విద్యాభ్యాసం చేసిన ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి చొరవ వల్లే ఐటీ టవర్‌ మంజూరు అయింది. ఐటీ టవర్‌ నిర్మాణం ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసుకునే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. 25వేల చదరపు అడుగులలో భవన నిర్మాణం జరుగుతుం ది. ఈ భవనంలో 250 మంది ఐటీ ప్రొఫెషన ల్స్‌ పని చేసుకునే విధంగా ఉంటుంది.

స్థానిక విద్యార్థులకు ఉపాధి

- ఎమ్మెల్యే మేఘారెడ్డి

జిల్లాలో ఐటీ టవర్‌ నిర్మాణంతో స్థానికంగా ఉన్నత చ దువులు చదివే విద్యార్థులకు ఉపాధి కల్పన ఏర్పడుతుం ది. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఐ టీ రావడం మరింత అభివృద్ధి చెందుతుంది. ఐటీ టవర్‌ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మం త్రి శ్రీధర్‌ బాబు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇన్‌చార్జి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎంపీ మల్లు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు.

Updated Date - Feb 12 , 2025 | 11:40 PM