Share News

వేద మంత్రోచ్ఛాణలతో విగ్రహాలకు అభిషేకాలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:31 PM

లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని దేవతా విగ్రహాలకు అభిషేకాలు, జ లాధివాసం అభిషేకాలను పురోహితుల వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా చేపట్టారు.

వేద మంత్రోచ్ఛాణలతో విగ్రహాలకు అభిషేకాలు
నందివడ్డెమాన్‌లోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు

బిజినేపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని దేవతా విగ్రహాలకు అభిషేకాలు, జ లాధివాసం అభిషేకాలను పురోహితుల వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా చేపట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్‌ గ్రా మంలో పురాతన లక్ష్మీ చెన్నకేశవ ఆలయ పునః ప్రతిష్ఠా మహోత్సవం మూడో రోజు శుక్రవారం ఉదయం ద్వారతోరణ ధ్వజకుంభారాధన, ప్రాతరా ధన, బాలభోగ నివేదన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యా హ్నం కర్మాంగ స్నపనం (ఆలయంలోని బింబాలను, యంత్రాలను ప్రత్యే కంగా అభిషేకించడం), జలాధివాసం (ప్రతిష్ఠ చేసేముందు దేవతా విగ్ర హాలను నీటిలో ఉంచడం) వంటి అభిషేకాలు ఆలయ అభివృద్ధి కమిటీ అ ధ్యక్షుడు తిప్పిరెడ్డి నంద కిశోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కనుల పం డువగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రతీ రోజు వేలాదిగా వస్తున్న భక్తులం దరికీ తిప్పిరెడ్డి దామోదర్‌ రెడ్డి, సుగుణమ్మ దంపతులు, గంగుల విజయ భాస్కర్‌ రెడ్డి, గీతారెడ్డి (యూఎస్‌ఏ) దంపతులు, తిప్పిరెడ్డి లక్ష్మీదేవమ్మ, కుమారుడు తిప్పిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, అరుణా రెడ్డి (యూఎస్‌ఏ), కొండా రెడ్డి నిర్మలమ్మ, కొడుకు కొండారెడ్డి కిరణ్‌ రెడ్డి, స్వేతా రెడ్డి దంపతులు, గుగ్గిల జగన్‌, శ్రావణి దంపతులు, తిప్పిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, చందన దంపతులు, చెరుకు కుమార స్వామి, సువర్ణలక్ష్మి దంపతులు, తిప్పిరెడ్డి రాంచంద్రారెడ్డి, నిరంజనీదేవి (యూఎస్‌ఏ) ఉచిత అన్నదానం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు బ తుకమ్మ, కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. పూజా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు ఆవుల రాములు, కృష్ణమాచారి, కడారి వెంకటయ్య, శంకర్‌, వెంకటేశ్వర్లు, కురుమయ్య, భూపతి సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 11:31 PM