నేడు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీ
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:06 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాయమ్మతోటలో గల రిషి జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఆంధ్రజ్యోతి-ఏబీఎన్, సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ కాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో నిర్వహించనున్నది.

మహబూబ్‌నగర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాయమ్మతోటలో గల రిషి జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఆంధ్రజ్యోతి-ఏబీఎన్, సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ కాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో నిర్వహించనున్నది. ఉదయం 9:30 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. విజేతలకు మొదటి బహుమతిగా రూ.ఆరు వేలు, ద్వితీయ బహుమతిగా రూ.నాలుగు వేలు, తృతీయ బహుమతిగా రూ.మూడువేల నగదు అందించనున్నారు. ప్రముఖ విద్యావేత్త, రిషి కళాశాల చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ ఎస్ వెంకటయ్య, కళాశాల చైర్‌పర్సన్ ఎస్ చంద్రకళవెంకట్ స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్నారు. పోటీలో పాల్గొనే వారు రంగులు తెచ్చుకోవాలి. చుక్కల ముగ్గుకు ప్రాధాన్యం ఉంటుంది. పోటీ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ హాజరుకానున్నారు.