Share News

సాగునీటి కోసం అన్నదాత తంటాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:57 PM

సాగునీటి కో సం రైతులు నానా తంటాలు ప డుతున్నారు. వేసవి వచ్చిందంటే వారి కష్టాలు వర్ణనాతీతం. నారాయణపేట జి ల్లా కృష్ణ మండల పరిధిలోని సుకూరులిం గంపల్లి గ్రామ శివారులో ప్రవేశిస్తూ తంగడిగి, సంగమ క్షేత్రం వద్ద కృష్ణ, భీమా నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తూ దాదాపు 225 కిలో మీటర్ల దూరం పారుతుంది.

సాగునీటి కోసం అన్నదాత తంటాలు
బండరాళ్లు తేలిన భీమా నది

- నీళ్లు తెచ్చుకునేందుకు అదనపు ఖర్చులు

- వేసవి వరి సాగు ప్రశ్నార్థకం - కృష్ణానదిలో సాగునీరు లేక బండలు తేలిన కృష్ణ, బీమా

కృష్ణ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సాగునీటి కో సం రైతులు నానా తంటాలు ప డుతున్నారు. వేసవి వచ్చిందంటే వారి కష్టాలు వర్ణనాతీతం. నారాయణపేట జి ల్లా కృష్ణ మండల పరిధిలోని సుకూరులిం గంపల్లి గ్రామ శివారులో ప్రవేశిస్తూ తంగడిగి, సంగమ క్షేత్రం వద్ద కృష్ణ, భీమా నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తూ దాదాపు 225 కిలో మీటర్ల దూరం పారుతుంది. నది ఒడ్డున ఉన్న సుకూరలింగంపల్లి, కూ సుమూర్తి, తంగడిగి, గురుజాల్‌, హిందూపూర్‌, తదిత ర గ్రామాల వరి రైతులు నదిలో ప్రైవేటు మోటార్ల ద్వారా ఎత్తిపోతల పథకం కింద వేల ఎకరాల్లో వరి భూములు సాగు చేస్తూ జీవనో పాధి పొందుతున్నారు. వర్షాకాలం పంటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేస్తూ.. ఎండా కాలంలో మాత్రం నానా తంటాలు పడుతున్నారు. నదుల్లో నీరు లేక బండరాళ్లు తేలి ఏడారిగా మారింది. దీంతో ఎక్స్‌కవేటర్ల ద్వారా కి.మీ దూరం నుంచి కాల్వల నుంచి మోటార్ల ద్వారా నీరు తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. అదనపు ఖర్చులు చేస్తూ ఎరువులు, కూలీలు, కల్పుల మందులు ఎకరాకు దాదాపు రూ. 25వేల నుంచి 30వేల ఖర్చు భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. ఏడాది పాటు నిండుగా పారే జీవ నదులుగా కృష్ణ, భీమా నదులు గత పది సంవత్సరాల నుంచి పైభాగం ఉన్న ప్రాజెక్టుల నుంచి ఆశించినంత దిగువకు నీరు విడుదల చేయక కృష్ణానది పైభాగంలో ఆల్మట్టి, గుగాల్‌ వద్ద ప్రాజెక్టు, భీమానదిపై భాగంలో రోడ్డు కం బ్యారేజీలు నిర్మాణం వల్ల కృష్ణ, భీమా నదులు బండరాళ్లు తేలి ఎడారిగా మారుతున్నాయి.

ప్రతీ వేసవిలో ఇబ్బందులే..

భీమానదిలో ప్రతీ వేసవి వరి సాగుకు ఇబ్బంది పడుతూ నదిలో కి.మీ దూరం నుంచి ఎక్స్‌కవేటర్ల ద్వారా తవ్వుకుం టూ మోటార్ల దగ్గర నీటిని తీసుకుని అక్కడి నుం చి వరిమడులకు నీరు సరఫరా చేయాల్సి వస్తోంది. దీంతో ఒకపక్క నారుమడులు నీరు లేక ఎండిపోతు న్నా చూడలేక వేల రూపాయలు ఖర్చులు చేసి తడు పుతున్నాం. పైభాగం నుంచి దిగువకు కర్ణాటక ప్రభు త్వం నీరు విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- శరణప్ప, రైతు, కూసుమూర్తి గ్రామం

Updated Date - Jan 16 , 2025 | 11:57 PM