రెనివట్లలో ఽధాన్యం గోల్‌మాల్
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:15 PM
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం రెనివట్ల గ్రామ శివారులో గల రైస్‌మిల్‌లో భారీగా ఽధాన్యం గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. దాని విలువ రూ.10.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

విలువ రూ.10.5 కోట్లు
సోదాల్లో వెలుగు
దాడి వివరాలను గోప్యంగా ఉంచిన అధికారులు
మద్దూర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం రెనివట్ల గ్రామ శివారులో గల రైస్‌మిల్‌లో భారీగా ఽధాన్యం గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. దాని విలువ రూ.10.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ప్రభుత్వం సీజన్‌లో రైస్‌మిల్‌కు అందించిన ధాన్యంలో సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా పక్కదారి పట్టించిన విషయం రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో వెల్లడైంది. ఇది బయటకు పొక్కకుండా సంబంధిత రైస్‌మిల్ యజమాని మేనేజ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు లక్షా మూడువేల బ్యాగుల ధాన్యం మాయమైందని, దాని విలువ దాదాపు రూ.10.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలో కూడా మండలంలోని పలు రైస్ మిల్లులపై దాడులు చేసి, జరిమానాలు విధించారు. తద్వారా రికవరీకి చర్యలు తీసుకున్నారు. అఽధికారులు రెనివట్లలోని రైస్‌మిల్లుపైనా దాడి చేసినా ఆ విషయాన్ని దాచి పెట్టారు. సంబంధిత యజమానిపై త్వరితగతిన చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడం చూస్తే మిల్లు యజమానికి అధికారుల్లో ఉన్న పలుకుబడి తెలుస్తోంది. అందుకే దాడులు జరిగిన మూడు రోజుల తరువాత శనివారం బయటకు పొక్కింది. వివరాలను తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ డీఎ్‌సవో సుదర్శన్‌ను ఫోన్ చేయగా స్పందించ లేదు.