పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:24 PM
ఊట్కూర్ మండలం చిన్నపొర్ల, నారాయణపేట జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.

ఊట్కూర్/నారాయణపేట, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఊట్కూర్ మండలం చిన్నపొర్ల, నారాయణపేట జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. చిన్నపొర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల 2000-01 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థు లు పాఠశాల ఆవరణలో సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యాబుద్దులు నేర్పిన మాజీ హెచ్‌ఎం ఎం.భాస్కర్‌రెడ్డి, ఏ.రాజేందర్, నర్సిములు, విజయలను ఆహ్వానించి వారి ఆశీర్వాదం పొందారు. అనంత రం విద్యార్థులు ఉపాధ్యాయుల విద్యాబోధనను గుర్తు చేసుకొని వారిని కొనియాడారు. ఆ తర్వాత ఉపాధ్యాయులను పూలమాల, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఆనంద్, చంద్రమోహన్, రాజు ఉన్నారు. అదేవిధంగా, నారాయణపేట శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో 2007-08లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక శీల గార్డెన్‌లో సమ్మేళనం జరుపుకున్నారు. హెచ్‌ఎం దత్తుచౌదరి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని అన్నారు. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా తల్లిదండ్రులను, గురువులను మర్చిపోవద్దన్నారు. అనంతరం గురువులను సత్కరించారు. కార్యక్రమంలో రాములప్ప, పద్మమ్మ, పటేల్ విజయలక్ష్మి, లక్ష్మి తదిత రులున్నా