ఇరిగేషన్ శాఖకు భూములు అప్పగింత
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:38 PM
మండలంలోని ఇరిగేషన్ శాఖకు సంబంఽధించిన భూములను రెవె ్యూ అధికారులు పంచనామా నిర్వహించి ఆ భూములను గురువారం అప్పగించారు.

కృష్ణ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇరిగేషన్ శాఖకు సంబంఽధించిన భూములను రెవె ్యూ అధికారులు పంచనామా నిర్వహించి ఆ భూములను గురువారం అప్పగించారు. మండలంలోని గుడెబల్లూరు గ్రామ శివారులోని భూ ములను ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం సంగంబండ హైలెవెల్ కెనాల్ కోసం రైతుల నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూములను కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రెండురోజులుగా సర్వే నిర్వహించి, భూములను అప్పగిస్తున్నారు.