అర్హులందరికీ ఓటు హక్కు ఉండాలి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:38 PM
అర్హు లందరూ ఓటు హ క్కును నమోదు చేసు కుని ఎన్నికల సమయం లో ఓటును వినియోగిం చుకోవాలని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు.

నాగర్‌కర్నూల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అర్హు లందరూ ఓటు హ క్కును నమోదు చేసు కుని ఎన్నికల సమయం లో ఓటును వినియోగిం చుకోవాలని కలెక్టర్ బదా వత్ సంతోష్ అన్నారు. శనివారం 15వ జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని జడ్పీ మైదానంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ల దినో త్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని వివి ధ కళాశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్య క్రమంలో అందరి చేత ఓటర్ల ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లకార్డు లు చేతబట్టి మన ఓటు-మన హక్కు అనే నినాదాతో పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ బదా వత్ సంతోష్ మాట్లా డుతూ ఓటు అనేది దేశ భవిష్యత్తు రూపక ల్పనలో కీలక పాత్ర పో షిస్తుందని, 18ఏళ్లు నిం డిన ప్రతీ ఒక్కరు తమ పేరును ఓటరుగా న మోదు చేయించు కో వాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, జిల్లాలోని ప్రధాన అధికారులు, సిబ్బం దితో కలిసి కలెక్టర్ ఓటరు అవ గాహనలో పాల్గొ న్నారు. అనంతరం వారందరితో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ ఓబులేష్, ఎస్‌డీసీ అరుణరెడ్డి, జిల్లా అధికా రులు తదితరులు పాల్గొన్నారు.