Share News

సాంకేతిక విజ్ఞానం వల్లే పురోగతి

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:24 PM

ఆ ధునిక సమాజంలో అన్నిరకాల పురోగతికి శా స్త్ర, సాంకేతిక విజ్ఞానమే మూలాధారమని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

సాంకేతిక విజ్ఞానం వల్లే పురోగతి
రోబోటిక్స్‌ టెక్నాలజీ పుస్తకాన్ని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

గద్వాల టౌన్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఆ ధునిక సమాజంలో అన్నిరకాల పురోగతికి శా స్త్ర, సాంకేతిక విజ్ఞానమే మూలాధారమని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. మా రుతున్న కాలానికి అనుగుణంగా నేటితరం వి ద్యార్థులు నూతన టెక్నాలజీపై అవగాహన పెం చుకోవాలన్నారు. మంగళవారం స్థానిక మ హా రాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశా ల లో రోబోటిక్స్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన ఒక రోజు వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. సోహం అకాడమీ కోఆ ర్డినేటర్‌ జశ్వంత్‌, ఇతర టీం సభ్యులు మాట్లా డుతూ సాంకేతికరంగంలో విద్యార్థులను ప్రోత్స హించడం కోసమే ఇలాంటి వర్క్‌షాప్‌లను త మ అకాడమీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో అందుబాటులో ఉన్న పరికరాల ఆధారంగా ప్రయోగపూర్వకంగా శిక్ష ణ తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా రోబోటిక్స్‌ టెక్నాలజీకి సంబంధించిన బుక్‌లె ట్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌, అధ్యాపకులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:24 PM