Share News

ఎన్టీఆర్‌, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలల దత్తత

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:44 PM

మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ, ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలను దేశ్‌పాండే ఫౌండేషన్‌ దత్తత తీసుకునేందుకు సూత్రపాయంగా అంగీకరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో ఫౌండేషన్‌ సభ్యులు సమావేశమయ్యారు.

ఎన్టీఆర్‌, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలల దత్తత
సీఎంతో సమావేశమైన దేశ్‌పాండే ఫౌండేషన్‌ సభ్యులు, చిత్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ముందుకొచ్చిన దేశ్‌పాండే ఫౌండేషన్‌

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం

పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్‌నగర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ, ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలను దేశ్‌పాండే ఫౌండేషన్‌ దత్తత తీసుకునేందుకు సూత్రపాయంగా అంగీకరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో ఫౌండేషన్‌ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. అమెరికాతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పుకోసం దేశ్‌పాండే ఫౌండేషన్‌ పని చేస్తోందని సీఎంకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ ఇవ్వ డం, నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాష్ట్రంలో కస్తూర్బా బాలికల పాఠశాల నిర్వహణలో పాలుపంచుకుంటే బాగుంటుందని, అలాగే మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని కోరగా వాళ్లు అంగీకరించారని ఎమ్మెల్యే యెన్నం వెల్లడించారు. సీఎం సూచన మేరకు మహిళా విద్యాభివృద్ధి, సమగ్ర అధ్యయనం కోసం ఈనెల ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు హుబ్లీలో జరిగే కాన్ఫరెన్స్‌కు ఎమ్మెల్యే యెన్నం వెళ్లనున్నారు. కార్యక్రమంలో దేశ్‌పాండే వ్యవస్థాపకులు గురురాజ్‌ దేశ్‌పాండే, జయశ్రీ దేశ్‌పాండే పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:44 PM