Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:47 PM

ప్రజా సమస్యల పరి ష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవ సహాయంలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాల ని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 57 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. చిన్నకార్పాముల పరిధిలో నిర్మించిన డంపింగ్‌యార్డును కొందరు వ్యక్తిగత అవసరాల కోసం కూలగొట్టా రని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పెద్దకొత ్తపల్లి మండల అధ్యక్షుడు పరశురాముడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌, కలెక్టరేట్‌ విభాగాల సూపరింటెండెంట్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:47 PM