Share News

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. యువకుడు మృతి

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:14 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని వేముల గ్రామ శివారులోని వెలిజాల-మి డ్జిల్‌ రోడ్డు వెంకోహెచారిస్‌ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుం ది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. యువకుడు మృతి

మిడ్జిల్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని వేముల గ్రామ శివారులోని వెలిజాల-మి డ్జిల్‌ రోడ్డు వెంకోహెచారిస్‌ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుం ది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన సొప్పరి చిన్న జంగ య్య కుమారుడు సొప్పరి రాఘవేందర్‌(25) మిడ్జిల్‌ మండలం చిలువేరు గ్రామంలోని బంధువుల వివాహ కార్యక్రమానికి వచ్చా డు. తిరిగి మిడ్జిల్‌ నుంచి తలకొండపల్లి మండలం వెలిజాల వైపు వెళుతుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడం తో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవా న్ని పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వ అస్పత్రికి తరలించేం దుకు ప్రయత్నించగా మృతుడి కుటుంబ సభ్యులు, బంఽధువులు వెంకోహెచారిస్‌కు చెందిన వాహ నం ఢీకొన్నదని తమకు కంపెనీ లో ఉన్న సీసీ పుటేజీలను చూ పించాలని మృతదేహంతో ధ ర్నాకు దిగారు. తమకు వెంకోహె చారిస్‌ వారు న్యాయం చేయాల ని నినాదాలు చేశారు. గుర్తు తెలి యని వాహనం ఆచూకీ కోసం సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మృతుడికి వివాహం జరిగి 10నెలలు కావస్తుందని, ప్రస్తుతం అతని భార్య గర్భవతి అని, మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Updated Date - Feb 16 , 2025 | 11:14 PM