ఏడాది పాలన సంతృప్తినిచ్చింది
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:14 PM
ఏడాది కాలం పా టే అధికారంలో ఉన్నా, ఈ సమ యం నాకు ఎంతో సంతృప్తిని ఇ చ్చిందని అంటున్నారు మహబూబ్‌నగర్ మునిసిపల్ చైర్మన్ ఎ.ఆ నంద్ కుమార్ గౌడ్. నేటితో చైర్మన్ పదవీకాలం ముగుస్తున్నందున శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇంట ర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..

మునిసిపల్ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్ గౌడ్
మహబూబ్‌నగర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలం పా టే అధికారంలో ఉన్నా, ఈ సమ యం నాకు ఎంతో సంతృప్తిని ఇ చ్చిందని అంటున్నారు మహబూబ్‌నగర్ మునిసిపల్ చైర్మన్ ఎ.ఆ నంద్ కుమార్ గౌడ్. నేటితో చైర్మన్ పదవీకాలం ముగుస్తున్నందున శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇంట ర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
చైర్మన్‌గా ఏడాది పాలన సంతృప్తినిచ్చిందా?
చైర్మన్‌గా గతేడాది జనవరి 12న బాధ్యతలు తీసుకున్నా. ఏడాదికాలం పనిచేసే అవకాశం వచ్చింది. ఒక్కరోజూ వృథా చేయకుండా వార్డులలో తిరిగి, సమస్యలు గుర్తించాం. తరువాత మునిసిపల్‌తోపాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి సార్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి, అన్ని వార్డులలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాం. కాలనీలకు వెళ్తే ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తుంటే సేవ చేశానన్న సంతప్తి కలుగుతోంది.
స్వపక్ష, విపక్ష సభ్యులను ఎలా సమన్వయం చేసుకోగలిగారు?
నేను ముందుగా కౌన్సిలర్. కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో వాళ్ల బాధలేంటో తెలుసు. చైర్మన్ అయ్యాక అన్ని వార్డులలో తిరిగి, పార్టీలకతీతంగా సమస్య ఉంటే ఆయా వార్డులకు నిధులు కేటాయించాము. దీంతో స్వపక్షంతోపాటు విపక్ష సభ్యులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పీరియడ్ అయిపోతున్నందున కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా?
కౌన్సిల్ పీరియడ్ అయిపోయినా బిల్లుల విషయంలో ఆందోళన చెందవద్దని నాతో పాటు ఎమ్మెల్యేగారు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, భరోసా ఇచ్చారు.
పురపాలికలో ఇంకా గుర్తించిన ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి?
ఇదివరకు కాలనీలను విస్మరించడంతో అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రై నేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల సమస్యలు ఉన్నాయి. ప్రస్తు తం ఏడాది కాలంగా రూ.202 కోట్ల నిధులతో పెద్ద ఎత్తున పనులు చేపట్టాము. మరికొన్ని కొనసాగుతున్నాయి. ఈ పనులైపోతే వరదనీటి మళ్లింపు కాలువల పనులు చేపట్టాల్సి ఉంది. అందుకు రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఇవి చేపడితే రామయ్యబౌళి, బీకే రెడ్డికాలనీ, శివశక్తినగర్, మైత్రీనగర్ వంటి కాలనీలకు వరద సమస్య తీరుతుంది. ఎమ్మెల్యే పట్టుబట్టి కార్పొరేషన్ సాధించారు. పాలమూరు మోడల్ సిటీగా మారనుంది.
వచే ్చ ఎన్నికల్లో మేయర్‌గా చూడొచ్చా?
ఎమ్మెల్యే నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వార్డులలో తిరిగి, కౌన్సిలర్ల ద్వారా గుర్తించిన పనులు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు కాలనీలలో పనులు జరుగుతుంటే ప్రజలు మమ్మల్ని సాధారంగా ఆహ్వానిస్తున్నారు. దేవుడి అనుగ్రహం, అధిష్టానం ఆశీస్సులు, ప్రజలు దీవిస్తే మళ్లీ వారికి సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.