మహిళను ఢీకొట్టిన కారు.. విరిగిన కాళ్లు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:54 PM
అతివేగంగా కారు ఢీకొట్టడంతో ఓ మహిళ రెం డు కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన గద్వాల జిల్లాకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది.

- మరో రెండు బైకులను ఢీకొట్టి ఉడాయించిన ఆకతాయిలు
గద్వాల క్రైం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అతివేగంగా కారు ఢీకొట్టడంతో ఓ మహిళ రెం డు కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన గద్వాల జిల్లాకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి స్ధానికులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. నర్వ మండలం నుంచి అనురాధ అనే మహిళ, పెళ్లి దుస్తులు కొనేందు కు బంధువులకు సహాయంగా గద్వాలకు వచ్చా రు. రాజవీధిలోని ఓ వస్త్ర దుకాణంలోకి వెళ్తుం డగా గాంధీచౌక్ నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. స్థానికుల ఆపే ప్రయత్నం చేయడంతో మరో రెండు బైకులను ఢీకొట్టి అదే వేగంతో రాయిచూర్ వైపు వెళ్లిపోయారు. తీవ్రం గా గాయపడి కిందపడిపోయిన ఆమెను బంధు వులు, స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తర లించారు. కాళ్లు విరిగిపోవడంతో అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి బంధువు నాగులుయాదవ్ తెలిపారు.