సమగ్రంగా పరిశీలన చేయాలి
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:25 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న ప్రాంభించనున్న రె ౖతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

పథకాల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ విజయేందిర బోయి
జిల్లా, మండల అధికారులతో సమీక్ష
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 18 (ఆంఽద్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న ప్రాంభించనున్న రె ౖతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనపై శనివారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా మండల ప్రత్యేక, నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లతో శనివారం వెబెక్స్ ద్వారా సమీక్షించారు. రైతు భరోసా కార్యక్రమం కింద వ్యవసాయ యోగ్యమైన భూమి, రేషన్ కార్డుల వెరిఫికేషన్‌పై క్షేత్ర స్థాయి పరిశీలనను మండలాల వారీగా సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు ఎన్ని రెవెన్యూ గ్రామాలు పూర్తి చేశారు?, ఇంకా ఎన్ని గ్రామాలు పూర్తి చేయాల్సి ఉంది?, రేషన్ కార్డుల వెరిఫికేషన్ ఎంత వరకు పూర్తి చేశారు?, ఏమైనా సమస్యలున్నాయా? అని అడిగారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. రైతు భరోసా లబ్ధిదారులను వ్యవవసాయ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో గుర్తించాలన్నారు. సాగుకు యోగ్యం కాని భూముల వివరాలు జాబితాలో ఉండకూడదని ఆదేశించారు. మిగిలిన గ్రామాల్లో ఈ నెల 20 వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో నాలుగు పథకాల లబ్ధిదారుల పేర్లను తెలుపాలన్నారు. గ్రామాలలో ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.