Share News

ఎల్లూరులో కాకతీయ కాలపు అరుదైన వీరగల్లు శిల్పం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:33 PM

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామంలో కాకతీయుల కాలంనాటి అ రుదైన వీరగల్లును శనివారం గుర్తించి నట్లు

 ఎల్లూరులో కాకతీయ కాలపు   అరుదైన వీరగల్లు శిల్పం
ఎల్లూరులో వీరగల్లు శిల్పాన్ని పరిశీలిస్తున్న పురావస్తు పరిశోధకుడు శివ నాగిరెడ్డి

- కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి

కొల్లాపూర్‌/పెబ్బేరు రూరల్‌, జనవ రి 18 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామంలో కాకతీయుల కాలంనాటి అ రుదైన వీరగల్లును శనివారం గుర్తించి నట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి వెల్లడించారు. వెన్నెల సాహిత్య అకాడమీ సభ్యులు ముచ్చర్ల దినకర్‌, చరిత్ర పరిశోధకుడు కొత్త తె లంగాణ చరిత్ర బృందం సభ్యుడు బైరోజు శ్యామ్‌ సుందర్‌లతో కలిసి ఎల్లూరు గ్రామ పంచాయతీ కార్యాల యంలోని బాపూజీ భవన్‌లో ఉన్న నల్ల శానపురాతిపై నలువైపులా శిల్పాలతో చెక్కిన వీరగల్లును శనివారం వారు సందర్శించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. ఒకవైపు చెన్న కేశవుడు, రెండు, మూడో వైపు యుద్ధ దృశ్యాలు, నాలుగో వైపు ఒక స్ర్తీ ఆత్మహసి దృశ్యంతో కాకతీయ కాలపు మన విధానానికి అద్దం పడుతున్న శిల్పం ఉన్నట్లు చెప్పారు. ఇది నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అరుదైనదని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం గల ఈ వీరగల్లును ఎత్తయిన పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాల బోర్డును ఏర్పాటు చేసి కాపాడుకోవాలని గ్రామస్థులకు నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మిం చిన శివాలయాన్ని ఆయన పరిశీలించారు. విజయనగర వాస్తు శిల్పశైలిలో ఈ శివాల యాన్ని నిర్మించారని, ఆలయ గోడలపై అనేక శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నా రు. ఈ ఆలయాన్ని పున రుద్ధరించడం అవసరం అన్నారు. కార్యక్రమంలో స్థానికుడు సురగౌని కృష్ణయ్య గౌడ్‌, సాయి కిరణ్‌, అద్దంకి రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:33 PM