Share News

ప్రతీ మండల కేంద్రంలో నమూనా గృహం

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:44 PM

ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఇందిరమ్మ నమూనా గృహాలను మార్చి నెలాఖరులోగా నిర్మించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీపీ గౌతమ్‌ సంబంధిత అధికారులు ఆదేశించారు.

ప్రతీ మండల కేంద్రంలో నమూనా గృహం

గద్వాలన్యూటౌన్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఇందిరమ్మ నమూనా గృహాలను మార్చి నెలాఖరులోగా నిర్మించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీపీ గౌతమ్‌ సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐడీవోసీ కా న్ఫరెన్స్‌ హాలులో ఇందిరమ్మ ఫేజ్‌-1 ఇళ్లు, డబుల్‌ బెడ్రూం ఇళ్లపనుల పురోగతిపై కలెక్టర్‌ బీఎం సంతోష్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో ఇందిరమ్మ మోడల్‌గృహాలను అత్యాధునిక సాం కేతికతో, నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని చెప్పారు. లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని, అర్హత లేకపోయినా ఆరీసీసీ రూఫ్‌ ఉన్న ఇళ్లను అర్హత జాబి తా నుంచి తొలగించాలని ఎంపీడీవోను ఆదేశించారు. నిర్మాణపనులకు స్వయం సహాయక సం ఘాలను భాగస్వామ్యం చేసి అవసరమైన మెటీరియల్‌ కొరత లేకుండా అందించేలా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. లబ్ధిదారుల ఖాళీ స్ధలాన్ని, బేస్మెంట్‌ వరకు నిర్మాణ పనుల ఫొటోలను గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు తీసి అప్‌లోడ్‌ చేయాలన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గృహనిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజనీరు చైతన్య, అధికారులు ఉన్నారు.

ఇళ్లతో పేదల కల సాకారం

ఎర్రవల్లి: ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం చేసేందుకు ప్రభుత్వం గ్రామాలను ఎంపిక చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండలంలోని బట్లదిన్నెలో కలెక్టర్‌ సంతోష్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పేజ్‌ 1 పనులను పరీశీలించారు. కొత్త ఇళ్ల నిర్మాణ పనలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లబ్ధిదారుడు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకోవాలని తెలిపారు. పునాది నుంచి బేస్‌మెంట్‌ పూర్తి చేసుకున్న తర్వాత నిధులు రూ.లక్ష ఖాతాలో జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, గృహ నిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ చైతన్య, ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో అజర్‌మొహీయద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:44 PM