నవోదయ పరీక్షకు 966 మంది హాజరు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:31 PM
వనపర్తి జిల్లాలో శనివారం నవోదయ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది.

వనపర్తి రూరల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లాలో శనివారం నవోదయ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. జిల్లాలో మొ త్తం 1,045 మంది విద్యార్థులు పరీ క్షకు హాజరు కావాల్సి ఉండగా.. 966 మంది హాజరై, 79 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి మధ్యా హ్నం 1:30 నిమిషాలకు ముగిసిం ది. జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థు లు పరీక్ష కేంద్రాల వద్దకు 11 గంటల వరకు చే రుకున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుం డా హాల్‌టికెట్ నెంబర్లను పరీక్ష కేంద్రాల వద్ద బ్లాక్ బోర్డుపై ఏర్పాటు చేశారు. కేంద్రాలను ఎ ప్పటికప్పుడు డీఈవో అబ్దుల్ ఘని, పరీక్షల ని ర్వహణ అధికారి గణేష్ కుమార్ పర్యవేక్షణ చేశారు.