Share News

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:02 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిందేనని బీసీ బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య డిమాండ్‌ చేశారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న బీసీ సంఘం నాయకులు

పాలమూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిందేనని బీసీ బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్దంపైగా పాలకుల పరిపాలన పరిశీలిస్తే సమైఖ్యాంధ్రాలో బీసీలకు జరిగిన అన్యాయమే మళ్లీ పునరావృతం అవుతోందన్నారు. తెలంగాణలో మళ్లీ సంపన్న వర్గాలే రాజ్యమేలుతున్నాయని బడుగు, బలహీన వర్గాలను యాచించే స్థాయికి పరిమితం చేశారన్నారు. 78 ఏళ్ల స్వతంత్య్ర భారత వనితకు ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి, సంక్షేమ పథకాలను ఎరవేస్తున్నారని తెలిపారు. విద్య, ఉపాధి రంగాల్లో దామాషా వాటా దక్కకుండా కుట్రలు చేస్తూ బీసీలను పేదరికంలో నెట్టేస్తున్నారని చెప్పారు. 70 ఏళ్ల నుంచి అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించే తీన్మార్‌ మల్లన్న విషయంలో ఎందుకు సమర్థించరన్నారు. మెట్టుకాడి ప్రభాకర్‌, కదిరి అంజయ్య, మడివాల నగేష్‌, రవికుమార్‌, బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:02 PM