‘ప్రజావాణి’కి 20 ఫిర్యాదులు
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:28 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు.

నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో రాంచందర్, ఏవో జయసుధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.