Share News

ప్రజావాణికి 18 ఫిర్యాదులు

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:37 PM

ప్రజావాణి కార్య క్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులకు సూచించారు.

ప్రజావాణికి 18 ఫిర్యాదులు
కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉలిగుండం, అన్నాసాగర్‌, నర్సాపూర్‌ గ్రామస్థులు

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్య క్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 18 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలం, ఆర్డీవో రాంచందర్‌, ఏవో జయసుద, వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు.

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి

దామరగిద్ద : మండల పరిధిలోని ఉలిగుండం, అన్నాసాగర్‌, నర్సాపూర్‌ గ్రామా లకు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ మూడు గ్రామాలను కలుపుకొని దాదాపు పది కిలోమీటర్ల దూరంలో యాన గుంది హైవే వరకు వేసిన రోడ్డు పూర్తిగా దెబ్బ తిందని, ప్రస్తుతం బీటీ ఆనవాళ్లు లేకుండా పోయిందని రోడ్డు పొడవునా గుంతలు, కంకర రాళ్లు ఉండడంతో నడవలేని స్థితి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ మాజీ సభ్యులు కిషన్‌రావు, సాయిరెడ్డి, తిరుపతి, దామోదర్‌రెడ్డి, మోహన్‌రాజ్‌, మల్లేష్‌, కొండప్ప, వెంకటయ్య, మహేష్‌ తదితరులున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:37 PM