Share News

పోలీస్‌ ప్రజావాణికి 15 ఫిర్యాదులు

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:20 PM

పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల పోలీసులు సానుభూతితో ఉండాలని, వారి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు.

 పోలీస్‌ ప్రజావాణికి 15 ఫిర్యాదులు
ఫిర్యాదురాలితో మాట్లాడుతున్న ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల పోలీసులు సానుభూతితో ఉండాలని, వారి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయా పోలీస్‌స్టేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి ఫైరవీలు లేకుండా ప్రజలు నేరుగా పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని, పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించాలని సూచించారు.

Updated Date - Jan 06 , 2025 | 11:20 PM