రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు పది ప్రదర్శనలు
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:59 PM
గద్వాల పట్టణంలోని బాలుర హైస్కూలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థులు ప్రతిభ చూపించారు.
గద్వాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గద్వాల పట్టణంలోని బాలుర హైస్కూలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థులు ప్రతిభ చూపించారు. ప్రతీ విద్యార్థి తన నైపుణ్యాలను ప్రదర్శించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అయితే అందులో పదిప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. అందు లో ఓ రిసోర్స్ మేనేజ్‌మెంట్ అంశంలో జూనియర్స్ కేటగిరిలో ఎం పవన్ జడ్పీహెచ్‌ఎస్ ఉత్తనూర్.. సీనియర్స్ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ ఉండవల్లి విద్యార్థి తరుణ్ ఎంపికయ్యారు. నేచురల్ ఫామింగ్ అంశంలో జూనియర్స్ క్యాటగిరిలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ గద్వాల విద్యార్థి జయవంశిక, సీనియర్స్ విభాగంలో ఏకశివ ఇంటర్‌నేషనల్ స్కూల్ ఎర్రవల్లి విద్యార్థి జ్యోతిక ఎంపికయ్యారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అం శంలో జూనియర్స్ క్యాటగిరిలో బ్రైట్‌స్టార్ హైస్కూల్ అయిజ విద్యార్థి జరీమిప్రిన్స్, సీనియర్ క్యాటగిరిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గద్వాల విద్యార్థిని జరాఅత్తర్ ఎంపికయ్యారు. ఫుడ్ హెల్త్ హైజీన్ అంశంలో జూనియర్స్ క్యాటగిరిలో శ్రీ శారద ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ గద్వాల విద్యార్థి శ్రీ, సీనియర్స్ క్యాటగిరిలో జడ్పీహెచ్‌ఎస్ శెట్టిఆత్మకూర్ విద్యార్థి తిరుమలేష్ ఎంపికయ్యారు. ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంశంలో జూనియర్ క్యాటగిరిలో విశ్వశాంతి హైస్కూల్ ఉండవెల్లి విద్యార్థి మౌనిక, సీనియర్స్ క్యాటగిరిలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి వినయ్ ఎంపికయ్యారు. మ్యాథమెటిక్స్ మోడలింగ్ అంశంలో జూనియర్ క్యాటగిరిలో సరస్వతీ టాలెంట్ స్కూల్ గద్వాల విద్యార్థి వరుణ్, సీనియర్ క్యాటగిరిలో ఇండో ఇంగ్లిష్ హైస్కూల్ గద్వాల విద్యార్థి ఉషశ్రీ ఎంపికయ్యారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశంలో జూనియర్స్ విభాగంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ గద్వాల విద్యార్థి అచ్యుత్, సీనియర్ క్యాటగిరిలో శ్రీ శారద ఇంగ్లిష్ మీడియం గద్వాల విద్యార్థి సోహెల్ ఎంపికయ్యారు. ఇన్‌స్పైర్ అంశంలో సాయి, అహల్య, అక్కల వైష్ణవి, లక్ష్మ, అల్పీషా, వీరపపోగు సూర్యకిరణ్ ఎంపికయ్యారు. సెమినార్ విభాగంలో నోబుల్ హైస్కూల్ గద్వాల విద్యార్థి కావ్య, టీచర్స్ ఎగ్జిబిట్స్ అంశంలో ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల గద్వాల విద్యార్థి నాగరాజు ఎంపికయ్యారు. వీరిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభినందించి ప్రసంశాపత్రాలను అందించారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకమైన అంశాలను బయటకు తీయడానికి ఇలాంటి సైన్స్‌ఫెయిర్ ఉప యోగపడుతాయని వివరించారు. కార్యక్రమంలో డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.