Share News

Kodandareddy: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:32 AM

రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని, రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గుచూపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి అధికారులకు సూచించారు.

Kodandareddy: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగాలి

  • వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని, రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గుచూపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగుకు అవసరమయ్యే యంత్ర పరికరాలను సబ్సిడీపై ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గడ్డమల్లయ్యగూడెం, చౌదరి గూడ, మొండి గౌరెల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు అధికారులు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.


ఆయా గ్రామాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు రైతులకు ఏంకావాలో గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం, నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగుచేసే పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 04:32 AM