Share News

Bandaru Dattatreya: నేడు బండారు దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:33 AM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా వ్రాసిన హిందీ "జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథ" ను “ప్రజల కథే.. నా ఆత్మకథ” పేరుతో తెలుగు అనువాదంగా జూన్ మొదటి వారంలో హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో ఆవిష్కరించనున్నారు.

 Bandaru Dattatreya: నేడు బండారు దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ

హైదరాబాద్‌ చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఎంపీ ఈటల నివాసంలో కోవింద్‌కు తేనీటి విందు

హైదరాబాద్‌, మూడుచింతలపల్లి, శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): హరియణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు శిల్పకళావేదికలో జరగనుంది. తెలంగాణ ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో రాసిన ఈ పుస్తకం మొదటి కాపీని, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మలకు అందచేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, శ్రీనివాసవర్మ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, త్రిపుర గవర్నర్లు అబ్దుల్‌ నజీర్‌, కంభంపాటి హరిబాబు, ఎన్‌ ఇంద్రసేనారెడ్డి కూడా హాజరుకానున్నారని అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు.

మాజీ రాష్ట్రపతికి ఘనస్వాగతం

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన షాద్‌నగర్‌ మండల పరిధిలోని నందిగామలో ఉన్న కన్హా ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం రాజ్‌భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌కు బండారు దత్తాత్రేయ స్వాగతం పలికారు. ఆ తర్వాత కోవింద్‌ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 04:33 AM