Share News

KTR: దమ్ముంటే రా.. డేట్, ప్లేజ్ ఏదైనా ఓకే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 07:18 PM

ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపుతోనే కేసు పెట్టిందన్నారు. రేవంత్‌కు నిజాయితీ, దమ్ము ఉంటే..

KTR: దమ్ముంటే రా.. డేట్, ప్లేజ్ ఏదైనా ఓకే..
CM Revanth And KTR

KTR: రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపుతోనే ఈ కార్ రేస్ కేసు పెట్టిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.. సంస్థల్ని గౌరవించి ఏసీబీ, ఈడీ విచారణకు వెళ్లినట్లు తెలిపారు. ఈడీ, ఏసీబీ రెండు సంస్థలూ ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని వివరించారు. అయితే, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని తెలిపారు. రేవంత్‌పై ఈడీ, ఏసీబీ కేసులు ఉన్నాయి కాబట్టే తనపై కేసులు పెట్టారని అన్నారు.


అయితే, లేని అవినీతిపై కోట్లు ఖర్చు పెట్టి విచారణ చేస్తున్నారని.. తనపై పెట్టిన ఖర్చు పథకాలకు పెడితే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. రేవంత్‌కు నిజాయితీ, దమ్ము ఉంటే జడ్జి ఎదుట తనతో పాటు విచారణకు రావాలని అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా? డేట్, ప్లేజ్ ఏదైనా రేవంత్ రెడ్డి ఇష్టమేనని సవాల్ చేశారు. త్వరలో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని.. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 07:18 PM