Share News

KTR: పాలన అంటే శంకుస్థాపనలే కాదు : కేటీఆర్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:21 AM

పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని, అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

KTR: పాలన అంటే శంకుస్థాపనలే కాదు : కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని, అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ దూరదృష్టి ఫలితంగా ఈనాడు తెలంగాణ రెండు అద్భుత ఫలితాలను సాధించిందని చెప్పారు. ఒకటి సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయితే, రెండవది యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ అని తెలిపారు.


సీతారామ ద్వారా ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందన్నారు. దామరచర్ల అలా్ట్ర మెగా ఽథర్మల్‌ ప్లాంట్‌లోని యూనిట్‌ వన్‌ 72 గంటల కోడ్‌(సీఓడీ)ను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈమేరకు కేటీఆర్‌ ఆదివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 05:21 AM