Share News

KTR: ‘కమ్మ’లపై చేసిన వ్యాఖ్యలను ఖండించలేదేం?

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:35 AM

బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీన ప్రతిపాదనను కేటీఆర్‌ తీసుకొచ్చారన్న సీఎం రమేష్‌.. ఈ సందర్భంగా కమ్మ సామాజిక వర్గంపైన కేటీఆర్‌ అసభ్య పదజాలాన్ని వాడారని చెప్పుకొచ్చారు..

KTR: ‘కమ్మ’లపై చేసిన వ్యాఖ్యలను ఖండించలేదేం?

  • కేటీఆర్‌కు జెట్టి కుసుమ్‌కుమార్‌ ప్రశ్న

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ‘‘బీజేపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విలీన ప్రతిపాదనను కేటీఆర్‌ తీసుకొచ్చారన్న సీఎం రమేష్‌.. ఈ సందర్భంగా కమ్మ సామాజిక వర్గంపైన కేటీఆర్‌ అసభ్య పదజాలాన్ని వాడారని చెప్పుకొచ్చారు... అయితే విలీన ప్రతిపాదన విషయంలో సీఎం రమేష్‌ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్‌.. కమ్మ సామాజికవర్గంపై వ్యాఖ్యల అంశాన్ని ఎందుకు ఖండించలేదు? అంటే కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌ నిజంగానే వ్యాఖ్యలు చేశారా?’’ అంటూ కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌(కేజీఎ్‌ఫ) వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్‌ నిలదీశారు.


ఆయనలో నెలకొన్న ఈ అహంకార పూరిత ధోరణే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందన్నారు. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్‌ అసభ్య పదజాలం వాడినట్లు చెబుతున్న సీఎం రమేష్‌.. ఆ వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు కమ్మ సామాజికవర్గం ఓట్లు అవసరం లేదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Updated Date - Jul 29 , 2025 | 04:35 AM