KTR: సీఎం ఇలాకాలో బడిపిల్లల పస్తులు!
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:24 AM
సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలోనే బడిపిల్లలు అన్నం దొరక్క పస్తులుండాల్సి వస్తోందన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయిందంటూ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.

ఢిల్లీ బాసులు, గల్లీ దోస్తుల ఆకలి తీర్చడం కాదు
పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి
మళ్లీ కన్నీరు పెడుతున్న తెలంగాణ పల్లె: కేటీఆర్
అమెరికాలో కేఐబీసీ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం
కలుషితాహారం పెడితే అరెస్టు చేస్తామన్న
ముఖ్యమంత్రి మాట ఏమైంది?: హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ కొనసాగిస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలోనే బడిపిల్లలు అన్నం దొరక్క పస్తులుండాల్సి వస్తోందన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయిందంటూ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘‘పేదల గూళ్ల పైకి బుల్డోజర్లు పంపడంపై ఉన్న ప్రేమ.. బడిపిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడంలో లేదా? అదానీకి రాష్ట్రంలోని వనరులు దోచి పెట్టడంలో ఉన్న శ్రద్ధ.. ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై లేదా? అమృత్ స్కీంను బామ్మర్దికి అప్పనంగా కట్టబెట్టడంలో ఉన్న తెలివి.. మూసీ ప్రక్షాళన పేరుతో మూటలు కట్టి ఢిల్లీకి కట్టలు పంపడంపై ఉన్న శ్రద్ధ.. భవిష్యత్తు భారతావనికి వారసులైన పసిపిల్లల కడుపు నింపడంలో లేదా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ బాసులు.. గల్లీ దోస్తుల ఆకలి తీర్చడం కాదని, ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ 420 అబద్ధపు హామీలు, 420 రోజుల చేతకాని పాలన.. ప్రజలకు శాపంగా మారిందని, 420 మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. అసమర్థులు అధికార పీఠమెక్కి.. అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. చలనం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్ల.. తెలంగాణ పల్లె మళ్లీ కన్నీరు పెడుతోందని పేర్కొన్నారు.
బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. దీనిని బీఆర్‌ఎస్ తరఫున క్షేత్రస్థాయిలో ఎండగడతామని, ఇందుకు సంబంధించి కార్యాచరణకు సిద్ధమవుతున్నామని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఆ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లాగే బీసీలకు ఇచ్చిన హామీలు కూడా డొల్ల అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ వర్గాల సంఖ్యను ప్రభుత్వం భారీగా తగ్గించి చూపించిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు మధుసూదనాచారి, గంగుల కమలాకర్, జోగు రామన్న సహా బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఏప్రిల్ 19న జరగనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్-2025కు హాజరు కావాల్సిందిగా కేటీఆర్‌ను కేఐబీసీ ఆహ్వానించింది. ఇవాన్‌స్టన్‌లోని ప్రతిష్ఠాత్మక నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో నిర్వహించే ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాలని కేఐబీసీ ఉపాధ్యక్షుడు చెనాక్షా గోరంట్ల శుక్రవారం ఓ లేఖ ద్వారా కోరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ: హరీశ్‌రావు
గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో కలుషితాహారం పెడితే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట ఏమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కలుషితాహారం వల్ల విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరిన ఘటనలు వందల సంఖ్యలో జరిగాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, కలుషితాహార ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..