KTR: రేషన్ కార్డులకూ సభలు పెట్టి గప్పాలు: కేటీఆర్
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:01 AM
చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, కాంగ్రెస్ అసమర్థ పాలనను చూశాక.. రాష్ట్రంలో గుర్రాలెవరో.. గాడిదలెవరో.. ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, కాంగ్రెస్ అసమర్థ పాలనను చూశాక.. రాష్ట్రంలో గుర్రాలెవరో.. గాడిదలెవరో.. ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మీ సేవా కేంద్రాల్లో ఇచ్చేసే రేషన్‌కార్డుల గురించి పెద్ద పెద్ద సభలుపెట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గప్పాలు కొడుతున్నాడని విమర్శించారు. ఆడబిడ్డలకు రూ.300కోట్ల మేర వడ్డీలేని రుణాలిచ్చి ఘనకార్యంలాగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోందని, కేసీఆర్ హయాంలో రూ.3000 కోట్ల దాకా వడ్డీలేని రుణాలిచ్చినా.. గొప్పగా చెప్పుకోలేదన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం వికారాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలువురు బుధవారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరిట అడ్డగోలు హామీల్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవడం ఖాయమని, అప్పుడు అధికారులందరూ సెట్ రైట్ అవుతారని, పార్టీ శ్రేణులను వేధించే పరిస్థితి ఉండదని అన్నారు.