Share News

BRS: మాతృభూమి రుణం తీర్చుకోండి

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:36 AM

డాల్‌స్లోని ఐటీ సీఈవీల సమావేశంలో కేటీఆర్‌ భారత యువత కోసం పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, మూడేళ్ల తరువాత అధికారంలోకి రాగానే పనులు మొదలు పెడతామన్నారు.

BRS: మాతృభూమి రుణం తీర్చుకోండి

అమెరికా ఐటీ కంపెనీల సీఈవోల సమావేశంలో కేటీఆర్‌

‘‘భారతదేశ యువత మీలాంటి వారి కోసం ఎదురుచూస్తోంది. అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి.. మాతృభూమి రుణం తీర్చుకోండి’’ అని అమెరికాలోని డాల్‌సలో పలు ఐటీ కంపెనీల సీఈవోల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ ఐటీ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా డాల్‌సలో ఉన్న పలు ఐటీ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ అయ్యారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌లోని టైర్‌ టు నగరాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, మంచి రోడ్లు, రైలు మార్గాల అనుసంధానంతో రాబోయే రెండు దశాబ్దాల్లో అద్భుతాలు జరుగుతాయన్నారు. తెలంగాణలో మూడేళ్ల తరువాత అధికారంలోకి రాగానే.. ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. . ఈ సందర్భంగా పలువురు ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో 9 సంవత్సరాల పాటు ఐటీ రంగానికి చేసిన అభివృద్థిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈమేరకు కేటీఆర్‌ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:36 AM