Share News

KTR ACB Enquiry: ఫార్ములా ఈ రేస్‌ కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ

ABN , Publish Date - Jun 16 , 2025 | 06:30 PM

KTR ACB Enquiry: ఏసీబీ అధికారులు కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు సూచించారు. ఇక, విచారణ సందర్భంగా కేటీఆర్ సెల్‌ఫోన్‌ను అధికారులు సీజ్ చేయాలని చూశారు.

KTR ACB Enquiry: ఫార్ములా ఈ రేస్‌ కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ
KTR ACB Enquiry

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విచారణ ముగిసింది. ఏసీబీ దాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను విచారించింది. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రశ్నలు వేశారు. విచారణ సందర్భంగా ముగ్గురు ఏసీబీ అధికారులు 60కి పైగా ప్రశ్నల్ని అడిగినట్లు తెలుస్తోంది.


ఏసీబీ అధికారులు కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు సూచించారు. ఇక, విచారణ సందర్భంగా కేటీఆర్ సెల్‌ఫోన్‌ను అధికారులు సీజ్ చేయాలని చూశారు. ఫోన్ గురించి అడగ్గా.. ‘ఈ రోజు ఫోన్ తేలేదని’ కేటీఆర్ చెప్పారు. ఈ నెల 18 లోగా ఈ రేసు హయాంలో వాడిన సెల్‌ఫోన్ సబ్‌మిట్ చేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇదో లొట్టపీసు కేసు. విచారణలో పనికిమాలిన ప్రశ్నలు తప్ప ఏమీ లేవు. రేవంత్‌రెడ్డి నన్నేమీ పీకలేరు. అయితే గీతే 15 రోజులు జైల్లో పెడతారేమో?’ అని అన్నారు.


విచారణకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు. ఏం తేల్చారు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు. అక్రమ కేసులకు భయపడం. అరెస్ట్ చేసినా వెనక్కు తగ్గం. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లై డిటెక్టర్ టెస్టుకు కూడా నేను సిద్ధం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రాజా రఘువంశీ కేసు.. హత్యకు వాడిన కత్తి స్వాధీనం..

దర్శకుడు మిస్సింగ్.. విమాన ప్రమాదం జరిగిన చోట సెల్‌ఫోన్ సిగ్నల్స్..

Updated Date - Jun 16 , 2025 | 07:39 PM