Share News

Jurala Project: నిండుగా జూరాల

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:40 AM

కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 84 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10 గేట్ల ద్వారా 58,722 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 31,852 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

Jurala Project: నిండుగా జూరాల

  • 10 గేట్ల నుంచి 90 వేల క్యూసెక్కులు దిగువకు

గద్వాల/దోమలపెంట, హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 84 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10 గేట్ల ద్వారా 58,722 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 31,852 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా 7.6 టీఎంసీల నీరు ఉంది. ఆల్మట్టికి 70,440 క్యూసెక్క్యుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 70.55 టీఎంసీల నీరు ఉంది.


నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 70,237 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గేట్ల ద్వారా 69,015 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 6 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 92,789 క్యూసెక్కులు, సాగర్‌లోకి 4వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

Updated Date - Jun 21 , 2025 | 03:40 AM