Share News

Komatireddy: ప్రజల జీవితాల్లో మార్పుతోనే సంతృప్తి

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:22 AM

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy: ప్రజల జీవితాల్లో మార్పుతోనే సంతృప్తి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామంలో గత ఏడాది డిసెంబర్‌లో ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన సోలార్‌ యూనిట్లతో మహిళలు నెలకు రూ.2వేలు సంపాదించడం సంతోషంగా ఉందన్నారు.


మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు అయిటిపాముల గ్రామంలోని స్వయం సహాయక సంఘంలోని 50 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.50లక్షల విలువ చేసే సోలార్‌ యూనిట్లను పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. స్వబ్యాగ్స్‌ ల్యాబ్‌ సహకారంతో సోలార్‌ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 04:22 AM