Share News

Asifabad accident: ఆసిఫాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:31 PM

కొమురం భీం ఆసిఫాబాద్ మోతుగూడ వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ను అతి వేగంతో కారు ఢీకొనడం..

Asifabad accident:  ఆసిఫాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
Asifabad accident

ఆసిఫాబాద్, అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ మోతుగూడ వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం(Komaram Bheem Asifabad Road Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ను అతి వేగంతో కారు ఢీకొనడం కారణంగా ఈ ప్రమాదం నెలకొంది. మృతులు కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామానికి చెందిన జగన్ (27), డోంగ్రి అనసూయ(32), డోంగ్రి ప్రజ్ఞాశీల్( 4 )గా గుర్తించారు. అక్కతో పాటు తమ్ముడు, మేనల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 04:31 PM