Share News

Kishan Reddy: సైన్యానికి అమ్మవారి దీవెనలుండాలి: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - May 11 , 2025 | 04:52 AM

దేశ భద్రత కోసం పోరాడుతున్న సైనికులకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, వారికి ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని బషీర్‌బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు జరిపించారు.

Kishan Reddy: సైన్యానికి అమ్మవారి దీవెనలుండాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, బర్కత్‌పుర, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశ భద్రత కోసం పోరాడుతున్న సైనికులకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, వారికి ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని బషీర్‌బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు జరిపించారు. ‘‘గతంలో పాకిస్థానీ ఉగ్రవాదులు చంపేవాళ్లు.. మనం చచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలో చర్యకు రెట్టింపు ప్రతిచర్యగా మన సైనికులు ధైర్యం, సాహసంతో వెళ్లి పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలను మట్టుబెట్టారు.’’ అని తెలిపారు.


దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా... అన్ని వర్గాల వారు మన సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వారికి మద్దతుగా ప్రజలంతా గ్రామగ్రామాన, మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని కిషన్‌ రెడ్డి కోరారు.

Updated Date - May 11 , 2025 | 04:52 AM